ETV Bharat / state

Delivery: ఆరు బయటే యాచకురాలు ప్రసవం

Delivery: అక్కడ దర్శనానికి వచ్చే భక్తుల వద్ద యాచిస్తూ కొందరు మహిళలు జీవనం సాగించేవారు. అయితే ఆ మహిళల్లో ఒకామె గర్భవతి.. ఎప్పటిలాగే యాచిస్తోన్న సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పులు తట్టుకోలేక ఆ మహిళ ఓ పక్కగా ఓరుగుతూ నేలపై పడిపోయి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఎక్కడ జరిగిందంటే?

beggar delivery
ఆరుబయటే ప్రసవించిన యాచకురాలు
author img

By

Published : Apr 25, 2022, 10:31 AM IST

Delivery: ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల కొండపై ఉన్న శివాలయం సమీపంలోని ఆరుబయటనే ఓ యాచకురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భవతి అయిన ఆమెకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. ఆ నొప్పులు తట్టుకోలేక ఆ మహిళ ఓ పక్కగా ఒరుగుతూ నేలపై పడిపోయింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలే ఆ మహిళకు అడ్డుగా ఓ వస్త్రాన్ని ఉంచి.. సపర్యలు చేశారు. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 వాహనం వచ్చేలోపే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తల్లి, బిడ్డకు వైద్యచికిత్సలు చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఇదీ చదవండి: Minister Dharmana: ప్రభుత్వ పథకాలు అక్కర్లేదా.. అయితే తొలగిస్తాం: మంత్రి ధర్మాన ప్రసాదరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.