ETV Bharat / state

అంధుల పాఠశాలలో అలజడి- రాజమహేంద్రవరంలో దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల కూల్చివేత

Zion Blind, Handicapped School Demolition in Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 20 ఏళ్లకుపైగా ఒకేచోట నిర్వహిస్తున్న జియాన్‌ అంధ, దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా విద్యార్థులు, సామగ్రిని వాహనాల్లో తరలించారు. అల్పాహారం చేయనీయకుండా కొట్టి, బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారని కొందరు విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

zion_blind_school_demolition
zion_blind_school_demolition
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 8:17 AM IST

Updated : Dec 30, 2023, 8:22 AM IST

Zion Blind, Handicapped School Demolition in Rajamahendravaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్య ప్రజలే కాదు అంధ, దివ్యాంగ విద్యార్థులు సైతం అష్టకష్టాలు పడుతున్నారు. కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రవరిస్తున్న తీరు వల్ల దివ్యాంగ విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్న ఓ అంధ, దివ్యాంగుల పాఠశాలకు వెళ్లి, గేట్లు మూసేసి ఆఘమేఘాలపై విద్యార్థులను, వారి సామగ్రిని వాహనాల్లో తరలించారు. అంతేకాదు, విద్యార్థులపై దయ, కనికరం చూపకుండా అల్పాహారం చేయనీయకుండా చేశారు.

జరిగిన సంఘటన ఇది: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత 20 ఏళ్లుగా జియాన్‌ అంధ, దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో వందలమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కొంతమంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బలవంతంగా పాఠశాల ఆవరణలోకి వెళ్లి, గేట్లు మూసేసి ఆఘమేఘాలపై విద్యార్థులను, వారి సామగ్రిని వాహనాల్లో తరలించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో ఉన్న షెడ్లు, నిర్మాణాలను నేలమట్టం చేశారు. అయితే, బడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు రావడం చూసి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల ఖాళీ చేయాలంటూ విద్యార్థులను అల్పాహారం చేయనీయకుండా కొట్టి, బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు వ్యాన్‌ ఎక్కనంటే దవడపై కొట్టారు. వదిలేయమని ప్రాధేయపడితే చాలా ఎక్కువ చేస్తున్నారంటూ భయపెట్టారని విద్యార్థులు కన్నీంటిపర్యంతమయ్యారు.

Government School Students Drinking Water Problems: బడిలో తాగటానికి నీళ్లు లేవు.. మా కోసం బటన్​ నొక్కవా జగన్​ మామయ్య

Zion School History: రాజమహేంద్రవరంలోని జీజీహెచ్ ఆవరణలో సుమారు 2 దశాబ్దాలుగా జియాన్ అంధ, దివ్యాంగుల పాఠశాల నడుస్తోంది. దాతల సాయంతో ఎకరా స్థలంలో ఈ పాఠశాల కొనసాగుతోంది. ఇందులో అంధులు, బధిరులు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు విద్యా వసతి కల్పిస్తున్నారు. సుమారు పాఠశాలలో 120 మంది విద్యార్థులుండగా, 78 మంది ప్రాంగణంలోనే ఉంటూ చదువుకుంటున్నారు. మిగతా వారు రోజూ వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతున్నారు. అయితే, జియాన్ పాఠశాల స్థలంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

Zion School Administrators Approached Court: ఈ క్రమంలో ఉన్న పళంగా స్థలాన్ని ఖాళీ చేయాలని జియాన్‌ పాఠశాల నిర్వాహకులను కోరగా, వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో అధికారులు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పేపర్ మిల్లు వద్దనున్న డంపింగ్ యార్డు స్థలాన్ని అధికారులు కేటాయించారు. అక్కడ దుర్వాసన, ఇతర సమస్యలు ఉండడంతో, వేరే స్థలాన్ని కేటాయించాలని కోర్టుకు నిర్వాహకులు విన్నవించారు. ఈ క్రమంలో న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని జియాన్ సంస్థ కార్యదర్శి బెన్నీ తెలిపారు. కోర్టు ఉత్తర్వులను కాదని, కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు, పోలీసులు వచ్చి తీవ్ర అలజడి సృష్టించారని వారు వాపోయారు.

'పచ్చళ్లతో తినండి లేదంటే చెత్తకుప్పలో పడేయండి' - అర్ధాకలితో గురుకుల విద్యార్థుల అవస్థలు

Zion School Administrators Comments: ''రాజమహేంద్రవరంలో గత 20ఏళ్లుగా జియాన్ అంధ, దివ్యాంగుల పాఠశాలను కొనసాగిస్తున్నాం. తాజాగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వచ్చి పాఠశాల గేట్లు మూసేసి విద్యార్థులను, సామగ్రి తరలించారు. ఆ తర్వాత అక్కడున్న షెడ్లు, ఇతర నిర్మాణాలను అన్నింటినీ నేలమట్టం చేశారు. సుమారు 45 మంది విద్యార్థుల్ని ప్రభుత్వ బాలికల పాఠశాలకు తరలించారు. అల్పాహారం కూడా చేయనీయకుండా వారిని కొట్టి మరీ బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అంధ, దివ్యాంగ విద్యార్థులకు మంచి వసతిని కల్పించాలని కోరుతున్నాం.'' అని జియాన్ పాఠశాల నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Collector on Zion School Demolition: ఈ సంఘటనపై కలెక్టర్ మాధవీలత స్పందిస్తూ వైద్య కళాశాల ప్రధాన భవన నిర్మాణ కోసం జియోన్ పాఠశాల స్థలం తప్పని సరని, వారికి లీజుకు ఇచ్చిన గడువు దాటి పోయిందని ఆమె అన్నారు. పాఠశాలను ఖాళీ చేయాలని పలుసార్లు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. వేరే ప్రాంతంలో విద్యార్థులకు స్థలం కేటాయించామన్నా కలెక్టర్, విద్యార్థులతో పాటు వారి సామగ్రిని తరలించినట్లు వెల్లడించారు.

Students Missing From Tribal Gurukula School: నలుగురు విద్యార్థుల అదృశ్యంపై ఆలస్యంగా కేసు నమోదు.. ప్రిన్సిపల్​కు మెమో జారీ

రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత- అంధ, దివ్యాంగుల పాఠశాల కూల్చివేత

Last Updated : Dec 30, 2023, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.