నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి మన రాష్ట్రానికి తాకుతోంది. ఐదుసార్లు యానాం నుంచి గెలిచిన మల్లాడి కృష్ణారావు పోటీ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఆయన మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి మద్దతిచ్చారు.
సుమారు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనపై పోటీ చేస్తున్నది నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు. వారంతా 30 ఏళ్ల లోపు వారే. రంగస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. మల్లాడి కృష్ణారావు కృషి చేస్తున్నారు. మరోవైపు ఆయన సీఎం జగన్కు ఆప్తుడు. ఈ కారణంగా.. వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణుగోపాల కృష్ణ.. యానాంలో వివిధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.
ఇదీ చదవండి: