సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు పాదయాత్ర చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ నెల 6 నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. క్రీస్తు రాజు పురం నుంచి శిఖామణి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టో ప్రకారం హామీలను అమలు చేస్తున్నారని అవినాష్ అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు లంకల గన్నవరం గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని అన్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు పది రోజుల పాటు నిర్వహించిన పాదయాత్ర ముగిసింది. ఎమ్మెల్యే జోగారావు నివాసం నుంచి సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగారావు అన్నారు.
ఇదీ చదవండి: