తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కొత్తగా ఏర్పాటైన తమ యూనియన్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న వారిపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని వైఎస్ఆర్ ఎడిబుల్ ఆయిల్ ట్యాంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ట్యాంక్ లారీ అసోసియేషన్ తమకు అనుకూలంగా ఉన్నవారికే సీరియల్ వేయడం, ఓడీలు ఇవ్వడం వల్ల మిగిలినవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పాత యూనియన్ నుంచి విడిపోయి... కొత్తగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా యూనియన్ ఏర్పాటుచేసుకున్న తర్వాత కూడా తమ లారీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
ఇవీ చూడండి...