తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మారుతినగర్‌కు చెందిన కొంతమంది యువకులు.. యాచకుల్ని, నిరాశ్రయుల్ని ఆదుకుంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం దాదాపు 150 మందికి ఆహారం అందజేశారు. లాక్ డౌన్ కారణంగా వారు పడుతున్న ఇబ్బందుల్ని చూసి స్పందించి.. వారికి చేయూతగా నిలిచారు.
దాతల సహకారంతో 50 రోజులుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. నేటితో ముగిస్తున్నట్లు తెలిపారు. ఇన్ని రోజులు అభాగ్యులకు అన్నంపెట్టిన యువకులను పలువురు ప్రశంసించారు.
ఇవీ చదవండి... కోనసీమలో 28 రోజుల పాటు కఠినంగా లాక్ డౌన్