ఆ ఇంట్లో తోరణాలు వాడలేదు. సందళ్లు ఆగలేదు.. సంబరాలకు సరిలేదు. నవ జంట నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని అందరి ఆకాంక్ష. ఊహించని విధంగా నవ వరుడు ఆత్మహత్య(Sucide) చేసుకోవడం ఆ ఇంట అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా(east godavari district)లో జరిగింది
రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన హరినాథ్ ఆ నెల 10వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ అంతలోనే ఎమైందో తెలియదు కానీ ఉరి వేసుకుని హరినాథ్ ఆత్మహత్య(Sucide) చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలను అందజేస్తామన్నారు. హరినాథ్ మృతిలో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి