తూర్పు గోదావరి జిల్లా వలసపకల గ్రామానికి చెందిన వీర మణికంఠ... ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను ప్రేమించవద్దంటూ అమ్మాయి స్నేహితులు మణికంఠను మందలించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన అతను.. చెదల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: