తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు.... ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో 4000 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. వైకాపాకు చెందిన ఆయన...జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. లాక్డౌన్ కారణంగా పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. ఆర్థిక వెసులుబాటు ఉన్నవారు పేదలను ఆదుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి