క్రిస్మస్ ను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు.. భారీ క్రిస్మస్ ట్రీ.. క్రీస్తు జన్మించిన ప్రదేశాన్ని తలపించే సెట్టింగులతో తీర్చిదిద్దారు. 1768 సంవత్సరంలో ఫ్రెంచివారి హయాంలో నిర్మించిన చర్చ్ కావడంతో ఎంతో ప్రఖ్యాతగాంచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: బస్సు ఎక్కాలంటే.. తోసే ఓపిక ఉండాల్సిందే..!