తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని ఓ లాడ్జిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్కు చెందిన పవన్, దివ్య లక్ష్మీగా పోలీసులు గుర్తించారు. రెండ్రోజులుగా లాడ్జిలో ఉంటున్న వీరు సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా మచిలీపట్నంగా పోలీసులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి-దళిత మహిళను మోసం చేశాడు...కటకటాల పాలయ్యాడు