తెదేపాను అందరి సహకారంతో ముందుకు నడిపి తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. భాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాలోని తెదేపా కార్యాలయానికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
తెదేపా వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనపై నమ్మకంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి.. పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడుతూ ముందుకు సాగుతానని నవీన్ అన్నారు. పార్టీ సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు న్యాయం జరిగేల చూస్తానని తెలిపారు.