ఇంటి నిర్మాణం కోసం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చెందిన షేక్ గౌస్ పది రోజుల కిందట 5 యూనిట్ల లారీ ఇసుక కోసం 16 వేల రూపాయలు ఆన్లైన్లో చెల్లించాడు. కానీ... శనివారం రాత్రి ఇసుక దిగుమతి చేయగానే నాసిరకం ఇసుక వచ్చిందని ఆయన వాపోయారు. ఈ విషయంపై లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా తమకు సంబంధం లేదంటూ చెప్పాడని తెలిపారు. ర్యాంపుల్లో ఎగుమతి చేసిన ఇసుక మాత్రమే తాను తీసుకువచ్చానంటూ సమాధానం ఇచ్చాడని చెప్పారు. భవనం స్లాబు నిమిత్తం ఇసుకను బుక్ చేశానని... కానీ మట్టితో కూడిన నాసిరకం ఇసుక వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కట్టిన డబ్బును పూర్తిగా నష్టపోయానని... ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గౌస్ వేడుకున్నారు.
ఇదీ చదవండి :
ఇసుక రీచ్‌లను పరిశీలించిన ఎస్ఈబీ అధికారి రాహుల్‌దేవ్ సింగ్