ETV Bharat / state

గిరిజన విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం..? - తూర్పుగోదావరిలో విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలిని బెదిరించి రెండున్నర రోజులు నరకం చూపాడు ఓ రాక్షసుడు.

warden raped student
గిరిజన విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం..?
author img

By

Published : Jan 24, 2020, 7:37 PM IST

గిరిజన విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం..?

ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 21న పాఠశాలకు వెళ్లిన విద్యార్థినిపై వార్డెన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన గదికి రాకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తానని... తన చెల్లిని బెదిరించాడని బాధితురాలి అన్నయ్య వాపోయాడు.

రెండున్నర రోజులపాటు విద్యార్థినిపై అత్యాచారం చేశాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు వార్డెన్​ను అరెస్టు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి

Intro:AP_VSP_56_24_BAALIKA_PAI_ATYACHAARAM_AVB_AP10153Body:*ఆశ్రమ ఉన్నతపాఠశాల విద్యార్దినిపై వార్డేన్ ఆత్యచారం*
తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతి పరిదిలో వున్న డొంకరాయి గిరిజనబాలికల ఆశ్రమ ఉన్నతపాఠశాలలొ ఎనిమిదవ తరగతి చదువుచున్న మైనర్ బాలిక ని ఆదే ఆశ్రమపాఠశాలకు'' చెందిన వార్డెన్ మడకం.లక్ష్మణ్ దొర ఆత్యచారం చేసాడని డోంకరాయి పోలీసుస్టేషన్లొ పిర్యాదు చేసింది.సబ్ఇన్ స్పెక్టర్ టి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారంగా సంక్రాంతి పండుగ శెలవులు అనంతరం 21వతేది ఉదయం హస్టల్ కు బాలిక చేరుకోగా రాత్రి ఎనిమిదిగంటల సమయం నుండి కనిపించటం లేదని గుర్తించిన వాచ్ మెన్ సిబ్బంది స్దానికంగా డొంకరాయి లో నివసిస్తున్న బాలిక అన్న,వదినల వద్దకు వెల్లి బాలిక గురించి ఆరా తీయగా బిత్తరపోయారు. ఉదయాన్నే హస్టల్లొ వదిలి వచ్చాము ఎందుకు వస్తాదని వారు బదులివ్వటంతో హాస్టల్ వాచ్‌మెన్ సిబ్బంది మాటమార్చుతు దాటవేసారని,దాంతొ అనుమానం వచ్చిన బాలిక సోదరుడు నేరుగా హస్టల్ వద్దకు వచ్చి తన చెల్లిని చూపించమని నిలదీయటం తో ఏమో ఎటు ఎల్లిందొ కనబడుటలేదని వెతుకుతున్నమని అక్కడవున్న సిబ్బంది సమాదానం చెప్పరని ఎస్ ఐ తెలిపారు. దాంతొ అతను వార్డెన్ లక్ష్మణ్ దొరను పొన్ చేసి నిలదీయగా ఎవరికి చెప్పవద్దు ఎటువెల్లిందో వేతుకుతున్నం అని చెప్పడంతో బాలిక కుటుంబీకులు కూడా వెతక సాగారు. రెండు రాత్రులు అనంతరం అనగా 23 న గురువారం ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చింది. దీంతో బాలికను తల్లి అన్నా వదినలను నిలదియగా వార్డెన్ లక్ష్మణ్ దొర తన ఇంటిలోనె ఉంచాడని తనపై రెండు రోజులుగా అత్యాచారం జరిపాడని కుటుంబసబ్యులకు తెలిపిందన్నారు. దాంతో వారి పిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.Conclusion:M Ramanarao, 9440715741
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.