తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడలో స్థానికులు 216 జాతీయ రహదారి నిర్మాణం పనులను అడ్డుకున్నారు. స్థానిక సోమేశ్వరస్వామి దేవాలయ భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా రహదారి పనులను ఏ విధంగా చేపడతారని గ్రామస్థులు.. అధికారులను ప్రశ్నించారు. ఆలయానికి భూమి చూపించాలని డిమాండ్ చేశారు. రహదారి పనులు జరుగుతున్న చోట పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
ఇదీ చదవండి: యానాంలో ఎన్నికల ప్రచారం.. మహిళల భారీ ర్యాలీ