సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుచేయాలని యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జ్యోతిబసు అన్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. జ్యోతిబసు మాట్లాడుతూ.. 11వ పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవ్వాల్సిన 50 శాతం బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి..