కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తునిలో వ్యాపారి ముద్దుల రామారావు గొడుగులు, మాస్క్లు అందించారు. సీఐ రమేష్ బాబుకు వైకాపా నేత ఏలూరి బాలు చేతుల మీదుగా రామారావు వీటిని అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల సేవలు చాలా గొప్పవని రామారావు అన్నారు. ఎండలో సేవలందిస్తున్న పోలీసులకు గొడుగులు బాగా ఉపయోగపడతాయన్నారు.
ఇదీ చదవండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!