తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంకలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సాయంత్రం పిచ్చుకలంక వద్ద బ్యారేజీ దిగువన గోదావరిలో సాన్నానికి వచ్చారు.
ఈ సమయంలో గోదావరి ఉద్ధృతి ఎక్కువ అవ్వటంతో మెండే బాబి(17), ఈతకోట చిన్న (15) అనే యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:
MINISTER VS MLA: మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం... నివ్వెరపోయిన అధికారులు!