తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణ శివారులో అనధికారికంగా నిర్వహిస్తున్న గ్యాస్ రీ ఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు, మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పెంకుల షెడ్ లో ఉన్న పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్ లోకి గ్యాస్ ఎక్కిస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరికి గాయలవ్వడమే కాక.. షెడ్డు, సామగ్రి సైతం పూర్తిగా ధ్వంసమైంది.
ఇదీ చదవండి: