తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన సూర్యసిద్ధు, అతని స్నేహితురాలు ద్విచక్రవాహనంపై జగ్గంపేట నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నారు. ఇదే క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. సూర్యసిద్దు మార్గమధ్యలోనే మృతి చెందాడు. అతని స్నేహితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..