దిశ చట్టంపై శిక్షణ.. అమలుపై అవగాహన
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ చట్టంపై శిక్షణా కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది, లాయర్లు, డాక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిశ చట్టాన్ని సమర్థంగా అమలుచేసేందుకు.. వివిధ శాఖలు సమన్వయంతో ఎలా పనిచేయాలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో కేసును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలన్నారు.
దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం