తౌక్టే తుపాను ప్రభావంతో గోదావరి నదిపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఐ.పోలవరం, భైరవపాలెం, కాట్రేనికోన మండలంలోని తీరప్రాంత గ్రామాలకు కెరటాలు తాకుతున్నాయి. యానాంకు గౌతమి గోదావరికి సముద్రం నీరు పోటెత్తడంతో కెరటాలకు మత్స్యకార నావలు కిందకు, పక్కకు కదులుతున్నాయి. పర్యాటక శాఖ బోటులోకి నీరు చేరడంతో ఓ పక్కకు వాలిపోయింది. నావలు, వలలకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా మత్స్యకారులు తగిన రక్షణ కల్పించుకున్నారు.
ఇదీ చూడండి.
తౌక్టే ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. అన్నదాతలకు తీవ్ర నష్టాలు