తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం బొంగరాలపాడులో అధికారపార్టీ ఇసుకదందా చేస్తోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. నకిలీ కూపన్లతో గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 10వ తేదీన ఇసుక రీచ్‌లలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని... 30 ఇసుక ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించామని గుర్తుచేశారు. ఇసుక మాఫియాతో స్థానిక అధికార, పోలీసు యంత్రాంగం కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ఎస్సై నాగేశ్వరరావు, సీఐ రవికుమార్ , రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇసుక దందాకు సహకరిస్తున్నారని రాజేశ్వరి వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న తనపై పోలీసులు అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు పెట్టారన్నారు. గిరిజనులైన తాము పెట్టాల్సిన అట్రాసిటీ కేసును తమపైనే పెడతారా అంటూ నిలదీసిన ఆమె... దీనిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి...ప్రాథమిక చికిత్స కొరత- గ్రామాలను కాటేస్తున్న కాలనాగు..