తూర్పుగోదావరిజిల్లా రాజోలు మండలం తాటిపాక కూడలిలోని దుకాణాలలో దుండగులు అర్ధరాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వీటిలో ఎనిమిది మెడికల్ దుకాణాలు, రెండు వస్త్ర దుకాణాలున్నాయి. డైలీ మార్కెట్లో కిరాణా షాపు చోరీకి యత్నించి.. విఫలమయ్యారు. పెద్ద ఎత్తున నగదు, సరుకు చోరీకి గురైందని దుకాణాదారులు చెబుతున్నారు. వరుస దోపిడీలతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఎస్సై కృష్ణమాచారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద రూ.1.04 కోట్ల బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం