ETV Bharat / state

Assault on children: భార్యపై కోపం.. కుమార్తెలకు నరకం: పిల్లలను కొడుతూ.. - Assault on children

A father who beat and tortured his children: అత్తమీద కోపం దుత్తమీద చూపించాలనుకున్నాడు ఆ ప్రబుద్దుడు. బతుకుదెరువు కోసం దుబాయ్​ వెళ్లిన భార్యపై కోపంతో.. తన ఇద్దరు పిల్లల్ని రోజు... చిత్రహింసలకు గురిచేయడం మెుదలు పెట్టాడు. భార్యను దుబాయ్​ నుంచి రప్పించాలనే ఉద్దేశంతో రోజు తాగివచ్చి భార్యకు ఫోన్ చేసి పిల్లల్ని చిత్రిహింసలు చేసే వీడియోలను పంపడం పరిపాటిగా మారిపోయింది. అవి చూసి తల్లడిల్లిన తల్లి వాటిని గ్రామ సర్పంచ్​కి పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Assault on children
పిల్లలపై చిత్రహింసలు
author img

By

Published : Sep 16, 2022, 11:47 AM IST

Tortured by Father in East Godavari: భార్యపై కోపంతో ఉన్మాదిలా మారాడొక భర్త. కన్న బిడ్డలని కూడా చూడకుండా చిన్నారులను చిత్రహింసలకు గురి చేశాడు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీసి భార్యకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసిందీ దారుణం. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, 11, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు ఏ పనీ లేకుండా తిరిగేవాడు. భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు.

ఈ క్రమంలో ఆమె పిల్లలను భర్త వద్ద వదిలి జీవనోపాధి కోసం దుబాయ్‌ వెళ్లింది. పిల్లలను తీసుకుని దావీదు ఇటీవల పెంటపాడుకు మకాం మార్చాడు. భార్యను ఎలాగైనా దుబాయ్‌ నుంచి రప్పించాలనే ఉద్దేశంతో కుమార్తెలను విచక్షణరహితంగా కొడుతూ.. చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ.. వారు భయంతో కేకలు వేస్తుంటే ఆ దృశ్యాలను కొడుకుతోనే వీడియో తీయించి ఆమెకు పంపడం మొదలెట్టాడు. అవి చూసి తల్లడిల్లిన ఆమె వాటిని గ్రామంలోని సర్పంచికి పంపగా ఆయన పోలీసులకు తెలియజేశారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ మూర్తి, ఎస్సై జి.సత్యనారాయణ గ్రామానికి చేరుకుని పిల్లల నుంచి వివరాలను సేకరించి కేసు నమోదుచేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.