గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ లంక గ్రామాల ప్రజల బతుకులను దుర్భరంగా మార్చేసింది. ఉద్ధృతి తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే..మరోసారి కుదిపేసింది. అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
కోనసీమలోని 74 లంక గ్రామాలలో వరద చుట్టుముట్టి ఉండటంతో.... ప్రజలు రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, 77 వేల మంది వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 23 వేల గృహాలలోకి వరద నీరు చేరింది. 94 పాకలు నేలకూలాయి.
ఇవీ చదవండి: ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల