తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం సావరం రోడ్డులో ఒక కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. రావులపాలానికి చెందిన సత్తి దొరారెడ్డి అనే వ్యక్తి.. కొత్త పేట వైపు నుంచి రావులపాలెం వైపు కారులో వెళ్తుండగా.. సావరం రోడ్లోకి వచ్చేసరికి కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు.. కారులో వ్యక్తిని బయటకు తీశారు. స్వల్ప గాయాలైన అతడిని రావులపాలెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి...