తూర్పు గోదావరి జిల్లా మన్యంలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రంపచోడవరం మండలంలో వంతెన కొట్టుకుపోయింది. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే గిరిజనులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి వేములకొండ పంచాయతీ పందిరిమామిడి నుంచి వాడపల్లి వెళ్లే రహదారి లోనూ కొండ వాగులు పొంగి ప్రవహించాయి.
ఇదీ చదవండి: ONE RUPEE TIFFIN: ఆ హోటల్లో రూపాయికే అల్పాహారం..ఎక్కడంటే