ETV Bharat / state

ధాన్యం సేకరణలో కోతలు..ఆందోళన చెందుతున్న అన్నదాతలు - వరి రైతన్నలు పరిస్థితి

AP Govt reducing grain collection: వరి రైతులకు ప్రభుత్వమే పొగపెడుతోంది. కారణాలు చెప్పకుండానే ధాన్యం సేకరణను..గత రెండేళ్లుగా కుదిస్తోంది. 2020-21 సంవత్సరం ఖరీఫ్‌తో పోలిస్తే..ఈ ఏడాది సేకరణలో 10 లక్షల టన్నులు కోత పడింది. కొనుగోలులో కొర్రీలు, వివిధ రకాల సతాయింపులతో..వరి వేయాలంటనే రైతులు వెనక్కుతగ్గేలా చేస్తోంది.

Grain collection
ధాన్యం సేకరణ
author img

By

Published : Dec 8, 2022, 2:15 PM IST

AP Govt reducing grain collection: ధాన్యం సేకరణ ద్వారా రైతులకు 48వేల 794 కోట్ల రూపాయల మేర సాయం చేశాం. గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్లతో పోలిస్తే..ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఏడాదికి సగటున 13 లక్షల టన్నుల పెరుగుదల కన్పిస్తోందని.. అన్నదాతలు సంతోషంగా ఉన్నారని, వ్యవసాయ సమీక్షలు, మీట నొక్కే సమయాల్లో సీఎం జగన్ చెబుతున్నారు.

వాస్తవానికి.. పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏటికేడూ ధాన్యం సేకరణలో కోతలు పడుతున్నాయి. సేకరణ లక్ష్యాలు తగ్గిపోతున్నాయి. 2020-21తో పోలిస్తే ధాన్యం సేకరణలో 10లక్షల టన్నుల కోత పడింది. పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో ఇప్పటికే రైతులు వరి సాగంటేనే కలవరపడుతున్నారు. ఖరీఫ్‌లో కోనసీమలోని పలు ప్రాంతాలతోపాటు వివిధ జిల్లాల్లో పంట విరామం ప్రకటించారు. అందుకే ఖరీఫ్‌లో 4.77 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగును లక్ష్యంగా నిర్దేశించగా 35.97 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మున్ముందు దీన్ని మరింత తగ్గించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుందని, భవిష్యత్తులో ఆహారధాన్యాల కొరత తలెత్తే ప్రమాదాన్ని గుర్తెరగడం లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.

ఏటికేడూ ధాన్యం సేకరణలో కోతలు..ఆందోళన చెందుతున్న రైతన్నలు

రాష్ట్రంలో 2019-20 ఖరీఫ్‌లో దాదాపు 48 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. తర్వాత ఏడాది 47 లక్షల టన్నులకు పైనే ఉంది. నిరుడు 40 లక్షల టన్నులకే పరిమితం చేశారు. ఈ ఏడాది మరో మూడు లక్షల టన్నుల మేర కుదించారు. రబీ సేకరణ కూడా గతేడాది తగ్గింది. 2020-21 రబీలో 37.25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా, 2021-22 రబీలో 27లక్షల టన్నులకే పరిమితమైంది.

ధాన్యం సేకరించాల్సిన పౌర సరఫరాల సంస్థ అప్పుల్లో మునిగితేలుతోంది. ధాన్యం సేకరణకు చేసే ఖర్చులో కేంద్రం నుంచి కొంత వస్తున్నా.. అప్పటివరకు సొంతంగా సర్దుబాటు చేనే పరిస్థితి లేదు. దీంతో మార్క్ ఫెడ్ ద్వారా అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులకు రెండు, మూడు నెలలైనా సొమ్ములు జమ కావడంలేదు. సేకరించిన ధాన్యానికి సొమ్ము చెల్లింపు గడువును 21 రోజులకు పెంచారు. 47 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలంటే..2020-21లో మద్దతు ధర ప్రకారం 8వేల 780 కోట్ల రూపాయలు అవసరం. 2022-23 మద్దతు ధరపై కొనాలంటే 9వేల588 కోట్ల రూపాయలు కావాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యంలో 90 లక్షల కార్డుల వరకు కేంద్రమే భరిస్తుంది. ఆ మొత్తాన్ని రాష్ట్రానికి తిరిగి ఇస్తుంది. అయినా సర్దుబాటు చేయలేక పౌరసరఫరాల సంస్థ సతమతం అవుతోంది. 10 లక్షల టన్నులకు తగ్గించుకుంటే 2వేల 40 కోట్ల రూపాయల మేర ఆర్థికభారం తగ్గుతుందని ఆలోచిస్తోంది.

కోతలు పూర్తయ్యే నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. గోతాలతో సహా అన్ని సిద్ధం చేయాల్సిన పౌర సరఫరాల సంస్థ నవంబరు వరకు చూద్దాం, చేద్దా మన్నట్లు వ్యవహరిస్తోంది. రెండేళ్ల కిందట ఈ-క్రాప్ అని, నిరుడు రైతులే ఆర్​బీకేలకు వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆర్​బీకేల్లో వాలంటీర్ల ద్వారా కొంటున్నామని, మిల్లర్లతో సంబంధం లేదని ప్రకటించారు. ఇలాంటి వాటితో కొనుగోలులో జాప్యం తప్పితే ఒనగూరేదేమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు.

ధాన్యం రైతులకు ఎక్కడా మద్దతు ధరా దక్కడం లేదు. తేమ పేరిట కోతలు..కొనసాగుతూనే ఉన్నాయి. చాలా జిల్లాల్లో రైతులకు గోతాలు అందుబాటులో ఉంచడం లేదు. బ్యాంకు గ్యారంటీ నిబంధనలు మార్చడంతో మిల్లులకు తరలించడంలోను జాప్యం జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే నిదానంగా కొనడం ద్వారా సేకరణ మరింత తగ్గించుకునే ఉద్దేశం కన్పిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.