రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతిచ్చిన క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాలు పునఃదర్శనానికి సిద్ధమవుతున్నాయి. ఆలయాలను శుభ్రపరిచి.. నిబంధనల ప్రకారం మార్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
మురుమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయాన్ని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపరిచారు. దర్శనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 600 ఏళ్ల చరిత్ర కలిగిన రోమన్ క్యాథలిక్ చర్చిలోను ప్రార్థనలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్ల యజమానులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తెరిచేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు ఆలయాలకు వచ్చే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..