యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఎల్‌బ్రస్ పర్వతాన్ని (5642 మీటర్లు) తెలుగు యువకుడు అధిరోహించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట ఉమేశ్ ఈ ఘనత సాధించాడు. ఆగస్టు 5న రాజమహేంద్రవరం నుంచి రష్యా బయల్దేరిన ఉమేశ్... మధ్యప్రదేశ్‌కు చెందిన మరో పర్వతారోహకుడితో కలిసి ఆగస్టు 15న శిఖరాగ్రం చేరుకొని మువ్వన్నెల జెండా ప్రదర్శించారు. 23×33 మీటర్ల పొడవైన భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సాధించానని ఉమేశ్ వివరించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఈ ఖ్యాతి సాధించడం గర్వంగా ఉందన్నారు. దేశంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని.. ‘ఎవ్రీ క్యాన్సర్ యాజ్ ఏన్ ఆన్సర్’ అనే నినాదంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పర్వతారోహణ చేసినట్లు తెలిపారు. గతంలో ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాననీ... ఎవరెస్టు ఎక్కడమే తన లక్ష్యమన్నారు.
ఇదీ చదవండి: