తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడులో అక్రమంగా మద్యం తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 192 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 4.30 లక్షల విలువ ఉంటుందని ఎస్సై బుజ్జిబాబు తెలిపారు. నిందితుడు రావులపాలెంకి చెందిన కొవ్వూరి రాజాప్రభాకర్రెడ్డిగా గుర్తించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: అంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం