ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికల్లో తెదేపా విజయమే లక్ష్యంగా పనిచేయాలి' - ఏపీ పంచాయతీ ఎన్నికలు

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

tdp leaders meeting on  local body elections at east godavari district
తెదేపా నేతలు విస్తృతస్థాయి సమావేశం
author img

By

Published : Jan 25, 2021, 8:45 AM IST

తూర్పుగోదావరి జిల్లా రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు, మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతిగ్రామంలోని తెదేపా కార్యకర్తలకు బలం ఉందని.. పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని కోరారు.

* జగ్గంపేటలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటరీ తెదేపా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, నియోజకవర్గ అబ్జర్వర్ బండారు అప్పలనాయుదు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయాలని పార్టీ శ్రేణులకు చెప్పారు.

* పంచాయతీ ఎన్నికల్లో తెదేపా విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పారు. జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న కొత్తపేట, ఆత్రేయపురం, మండలాల తెదేపా నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. అమలాపురం పార్లమెంటరీ తెదేపా ఉపాధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

పల్లెపోరు... సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.