ప్రభుత్వ వైఫల్యం కారణంగానే లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెదేపా నేత గన్ని కృష్ణ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పంటనష్ట పరిహారంగా రూ. 5 వేలు ఇచ్చామని.., జగన్ మాత్రం రూ.500 పరిహారమిచ్చి చేతులుదులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అధికార పక్షం పట్ల హూందాగా వ్యవహరించాలి
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన అన్నదాతలను తక్షణమే ఆదుకోవాలని చిత్తూరు జిల్లా నగరి తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి భాను ప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పంటనష్టం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ప్రతిపక్షం పట్ల అధికార పక్షం హూందాగా వ్యవహరించాలి
-గాలి భాను ప్రకాశ్
ఇదీచదవండి