తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైకాపా శాసనసభ్యులు పర్వత ప్రసాద్‌పై తెదేపా నియోజకవర్గ బాధ్యులు వరుపుల రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన తెదేపా నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. సీనియర్ నాయకులను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని హితవు పలికారు. గత 16 నెలలు కాలంలో 20 రకాలుగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. పర్వత ప్రసాద్ అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతానని వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి