ETV Bharat / state

TDP Leader Nallamilli Ramakrishna Reddy Fire on CM Jagan: "సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం.. నీటితీరువా వసూళ్లు చేయడం దారుణం"

TDP Leader Nallamilli Ramakrishna Reddy Fire on CM Jagan : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే నీటి తీరువా వసూళ్లను ఉపసంహరించుకోవాలని, యూరియా ధరలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

TDP_Leader_Nallamilli_Ramakrishna_Reddy_Fire_on_CM_Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 4:52 PM IST

TDP Leader Nallamilli Ramakrishna Reddy Fire on CM Jagan : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే నీటి తీరువా వసూళ్లను ఉపసంహరించుకోవాలని, యూరియా ధరలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Increased Urea Prices : సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక సందర్భాలలో రుజువు చేసుకుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం లేని పరిస్థితి ఏర్పడినప్పటికీ రైతులు అనేక కష్టాలకు ఓర్చి ఏదో ఒక విధంగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. అయితే రైతులకు యూరియా అవసరం పడే పరిస్థితికి వచ్చేప్పటికి యూరియా ధరలు పెరగడం దారుణ పరిస్థితి అని తెలిపారు. రిటైలర్లు 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచి యూరియా అమ్ముతున్నారన్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందన్నాని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Water Tax: భారంగా నీటి తీరువా.. ఆందోళనలో రైతులు...

Water Tax for Agriculture Lands in AP : కృష్ణా, గోదావరి డెల్టాలలో సాగునీరుకి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు సంవత్సరాలుగా యూరియా ధరలు కానీ, ఇతర ఎరువుల ధరలు కానీ విపరీతంగా పెంచి రైతులను దోచుకున్న వైసీపీ ప్రభుత్వం మరో దోపిడికి సిద్ధమైందని తెలిపారు. గోదావరి డెల్టాలో సమృద్ధిగా సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం.. నీటి తీరువా వసూళ్లు వేగవంతం చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకర పరిణామమని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా 3.52 కోట్ల రూపాయలు నీటి తీరువా బకాయిలు ఉన్నాయని వాటని తక్షణమే వసూలు చేసి ఖజానాకి జమ చేయాలని ఆదేశించడం చాలా దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలకరికి నీరు ఇవ్వలేని ప్రభుత్వం నీటి తీరువా వసూళ్లు చేయడానికి ముందుకు రావడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నీటి తీరువా వసూళ్లు రద్దు చేశారని గుర్తు చేశారు.

యూరియా కొరత.. అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు
Farmers Facing Problems : వైసీపీ ప్రభుత్వం ఆర్ధికంగా తీవ్రమైన ఇబ్బందులలో కురుకుపోయినపుడు అన్ని రకాల పన్నులతో, నీటి తీరువా పన్ను కూడా వసూళ్లు చేసే విధానానికి తెర తీయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ పంటలను సాగు చేస్తుంటే నీటి తీరువా వసూళ్లు కోసం అధికారులు ముందుకు రావడం చాలా దారుణమని అసహనం వ్యక్తం చేశారు.

రైతులు తీవ్రమైన ఇబ్బందులలో ఉండి, వ్యవసాయాన్ని వదిలిపెట్టి పోవాలనే ఆలోచనతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. 'మూలిగే నక్క మీద తాటి పండు పడిన తీరుగా' నీటి తీరువా పన్ను వసూళ్లు, యూరియా ధరలు పెరగడం వారికి మరిత తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నీటి తీరువా వసూళ్లు ఉపసంహరించుకోవాలని, యూరియా ధరలను తక్షణమే అదుపులోకి తీసుకు రావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
యూరియా కృత్రిమ కొరత.. దండుకుంటున్న వ్యాపారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.