మద్యం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తే ఆ పాలసీ లోపభూయిష్టం అంటూ హడావుడి చేసిన జగన్ నేటికీ సరైన ఇసుక పాలసీ అమలు చేయలేకపోయారని నెహ్రూ విమర్శించారు. అమరావతి విషయంలో మడమ తిప్పి మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైఫల్యం చెందారని నెహ్రూ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ