పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో వైకాపా నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్థలాల మెరక పేరుతో వైకాపా మట్టిని దోపిడి చేస్తుందని ఆయన ఆరోపించారు. భూముల కొనుగోలు ధరలను రెండు రెట్లు పెంచేసి లబ్ది పొందుతున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన లబ్దిదారులకు ఏ గ్రామాల్లో భూములు కేటాయిస్తారో స్పష్టం చేయాలని కోరారు.
ఇదీ చదవండి :
'తెదేపా హయాంలో డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి'