బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటించనుంది. సీతానగరంలో శిరోముండనం ఘటనలో బాధితుడిని కమిటీ సభ్యులు పరామర్శించనున్నారు. అలాగే సామూహిక అత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కమిటీ ఎస్సీ యువకుడు ప్రసాద్, కుటుంబ సభ్యులతో మాట్లాడనుంది. అనంతరం తమ నివేదికను చంద్రబాబుకు అందజేస్తారు.
ఇదీ చదవండి: ఆ ఐదు జిల్లాల్లో కరోనా విజృంభణ... రికార్డు స్థాయిలో కేసులు నమోదు