తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతిని జరిపారు. గోదావరి గట్టున గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ట్రస్ట్, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీసీసీ ఛానల్ ఎండీ కొండలరావు తెలిపారు. పేదలకు ఆహార పొట్లాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రౌతు సూర్యప్రకాశరావు, ఇతర నాయకులు, ఎస్వీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు విశాఖ కేజీహెచ్ ఎంపిక