తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం మెరకపాలెం సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న పాముల లలిత్ కిరణ్ బుధవారం రాత్రి విష రసాయనం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రాజోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం మాట్లాడుతూ ఇటీవల గ్రామస్థుల అభ్యర్థనపై మెరకపాలెంలో శ్మశాన భూమి సర్వే చేశానని, అప్పట్నుంచి మండల సర్వేయర్ శ్రీవాణి, టైపిస్టు సర్వేశ్వరరావు, తహసీల్దారు ముక్తేశ్వరరావు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా అతని ఆరోపణలు అవాస్తవమని, అమలాపురంలో అతను చేయాల్సిన పనిని పూర్తి చేయలేదని.. అదే విషయాన్ని పై అధికారులు అడిగితే అసభ్యంగా ప్రవర్తించాడని తహసీల్దారు ముక్తేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెరకపాలెం, పొన్నమండలో సొసైటీ భూములు సరిహద్దులకు సంబంధించిన విషయంలో అతను సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆరోపణలు చేస్తున్నాడన్నారు.
ఇదీ చదవండి: అధికారిక కార్యక్రమంలో ఓ మతానికి చెందిన పాట..పలువురి అభ్యంతరం