ETV Bharat / state

ఎమ్మెల్యే జెండా ఊపగా.. మాజీ ఎమ్మెల్యే బస్సు నడపగా!!

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైదరాబాద్​కు సూపర్ లగ్జరీ సర్వీసును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రారంభించారు.

ఆర్టీసీ బస్సు
author img

By

Published : Jul 22, 2019, 3:01 AM IST

ఎమ్మెల్యే జెండా ఊపగా.. మాజీ ఎమ్మెల్యే బస్సు నడపగా...

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైద్రాబాద్‌ వెళ్లే ప్రయాణికులకు సూపర్‌లగ్జరీ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే జెండా ఊపగా... మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు బస్సును నడుపుతూ ప్రయాణ ప్రాంగణానికి తీసుకువచ్చారు.

ఎమ్మెల్యే జెండా ఊపగా.. మాజీ ఎమ్మెల్యే బస్సు నడపగా...

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైద్రాబాద్‌ వెళ్లే ప్రయాణికులకు సూపర్‌లగ్జరీ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే జెండా ఊపగా... మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు బస్సును నడుపుతూ ప్రయాణ ప్రాంగణానికి తీసుకువచ్చారు.

ఇది కూడా చదవండి

ఏలేరు జలాశయం నుంచి సాగునీరు విడుదల

Intro:
*యాంకర్....*
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కుమారస్వామికి అన్ని దారులు మూసుకుపోతున్నాయి. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు సైతం ఆయన సిద్ధమయ్యారు. ఇక సభ్యులకు విప్ జారీ అంశం సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న నేపథ్యంలో... అందుకు అనుగుణంగా బలపరీక్ష పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష జరిగే అవకాశాలు లేవని కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. లుక్...

*వాయిస్ ఓవర్ - 1*
కన్నడ నాట రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. కుమారస్వామి ప్రభుత్వం ఉంటుందా లేక పడిపోతుందా అనేది ఈ రోజు తేలనుంది. అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష జరిగితే ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం ప్రకారం కుమార స్వామి సర్కారు నిలబడే అవకాశాలు లేవు. రెండు పార్టీల నుంచి 16 మంది రాజీనామాలు చేయగా... ఇద్దరు స్వతంత్రులు దూరం అయ్యారు. బీఎస్పీ నుంచి గెలిచిన మహేష్... మాయావతి ఆదేశాలతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కుమార స్వామి సర్కారుకు కాంగ్రెస్ నుంచి 66, జేడీఎస్ నుంచి 34 మంది.. ఒక బీఎస్పీ సభ్యునితో కలిపి మొత్తం కలిపి 101 మంది ఎమ్మెల్యేల బలముంది. అయితే వీరిలో శ్రీమంత్ పటేల్, నాగేంద్ర అనే ఇద్దరు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నామని .. . అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని ప్రకటించటం సంకీర్ణ సర్కారుకు ఆందోళన కలిగించే అంశం. ఇక స్పీకర్ ది నిర్ణయాత్మక ఓటు కావడంతో కూటమి బలం 98 మాత్రమే అవుతుంది. అదే సమయంలో బిజెపికి 105 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు స్వతంత్రుల మద్దతుంది. కాబట్టి అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే కుమార స్వామి సర్కారు నిలబడే అవకాశాలు అతి స్వల్పం. దీంతో కుమార స్వామి కాంగ్రెస్ పార్టీ ముందు కొత్త ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జేడీఎస్ మద్దతు ఇస్తుందని వర్తమానం పంపారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సిద్ధరామయ్య వర్గానికి చెందినవారే. కాబట్టి ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తే తాము మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం తాము డబ్బు, అధికారం కోసం రాజీనామా చేయలేదని... అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించటమే తమ లక్ష్యమని ప్రకటించారు. అసలు ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు.

*బైట్.. బసవరాజు, కాంగ్రెసు ఎమ్మెల్యే (నిల్చున్న వ్యక్తి)
బైట్... విశ్వనాథ్, జేడీఎస్ ఎమ్మెల్యే(కూర్చున్న వ్యక్తి)*
ఈ రెండు బైట్లు ఈటీవి భారత్ రాప్ ద్వారా వచ్చాయి.

*వాయిస్ ఓవర్ - 2*
ఇపుడు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఆదివారం నాడు బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించింది. కాంగ్రెసు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పిసిసి అధ్యక్షుడు దినేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జేడీఎస్ ప్రతిపాదన, రెబల్ ఎమ్మెల్యేల ప్రకటనపై సమాలోచనలు చేశారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్న తరుణంలో స్పీకర్ ఎలా వ్యవహరిస్తారనేది కీలకం కానుంది. అయితే బలపరీక్షకు సంబంధించి గవర్నర్ రెండుసార్లు లేఖ రాసినా స్పీకర్ స్పందించలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. తనను ఆదేశించే అధికారం గవర్నర్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలకు విప్ జారీ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అలాగే బలపరీక్ష పైనా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండింటిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కీలకం కానుంది. సుప్రీం ఆదేశాలను బట్టి తమ వైఖరి ఉంటుందని శాసన సభ పక్ష సమావేశం తర్వాత దినేష్ గుండూరావు తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష... ఓటింగ్ ఉండేందుకు అవకాశం లేదన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తర్వాత బాధ పడతారని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల సమావేశంలో సిద్ధరామయ్య ఒకింత బావోద్వేగానికి గురైనట్లు సమాచారం. రాజీనామా చేసిన వారంతా తాను గెలుపించిన వారేనని.. నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

*బైట్.. దినేష్ గుండూరావు (ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది.)*

*ఎండ్ వాయిస్ ఓవర్* మరోవైపు బిజెపి ఎలాగైనా విశ్వాస పరీక్షలో గెలవాలని పావులు కదుపుతోంది. ఆదివారం జరిగిన బిజెపి ఎమ్మెల్యేల సమావేశంలో... బలపరీక్ష జరిగి తాము అధికారంలోకి వస్తామని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఇవాళ కూడా గవర్నర్ ద్వారా ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ఆయన రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష ద్వారా మాత్రమే తాము అధికారంలోకి రావాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ వ్యవహారంలో కేంద్ర జోక్యం ఉండదని స్పష్టం చేశారు. Body:Reporter S.P.Chandra Sekhar
Camera bhaskar
Centre Bangalore
Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.