తూర్పు గోదావరి జిల్లా మన్యంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి విలీన మండలాల్లో మిర్చిపంట తడిసి ముద్దైంది. ఎటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాల్లో వేల ఎకరాల్లో పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఎటపాక మండలంలోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలైన గౌరి దేవిపేట, గన్నవరం, నందిగామ, మురుమూరు, తోటపల్లి, సీతాపురం, నెల్లిపాక గ్రామాల్లో వందల ఎకరాల్లో మిర్చి కోత కోసి రాశులుగా ఆరబెట్టారు. తెల్లవారుఝామున భారీ వర్షం కురిసిన కారణంగా.. ఆరబెట్టిన మిర్చి పూర్తిగా తడిసిపోయింది.
చేతి కొచ్చిన పంట వర్షం పాలు
కనీసం టార్పాలిన్లు కప్పుకొనే అవకాశం లేకుండా ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల మిర్చి నాణ్యత దెబ్బతిని తక్కువ ధర పలుకుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా మరో పక్కకోత కోయని పంట కూడా తడిసి పోయింది. దీంతో అది కూడా నష్టపోతామని అన్నదాతలు అంటున్నారు. ఆదాయం సమకూరుతుందని ఆశించిన సమయంలో కురిసిన అకాల వర్షాలకు మిర్చి రైతులు దిగాలు చెందున్నారు.
ఇదీ చదవండి:
కూన రవికి రాజాం కోర్టులో బెయిల్.. లొంగిపోయిన అందరికీ మంజూరు