ETV Bharat / state

వైద్య సిబ్బందికి పరికరాలు అందించిన పూర్వ విద్యార్థులు - తూర్పు గోదావరి వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు వైద్య సిబ్బందికి వైద్య పరికరాలు అందజేశారు. జిల్లాలోని మరిన్ని పీహెచ్​సీలకు ఇదే విధంగా అందించనున్నట్లు తెలిపారు.

corona equipment donation by old students
వైద్యసిబ్బందికి పరికరాలు అందించిన పూర్వ విద్యార్థులు
author img

By

Published : May 23, 2021, 8:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991 - 92 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు.. జగ్గంపేట వైద్య సిబ్బందికి వైద్య పరికరాలు అందజేశారు. కరోనా సోకిన వారిని కాపాడడంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయక సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వాటిని అందించారు.

డిజిటల్ బీపీ మిషన్-1, పల్స్ ఆక్సిమీటర్స్-2, ఫేస్ షీల్డ్స్-5, హ్యాండ్ గ్లౌజ్​లు-200, N-95 మాస్క్స్-100, సర్జికల్ మాస్కులు-200, శానిటైజర్ బాటిళ్లు- 15, శానిటైజర్- 5 లీటర్లను తమవంతు సాయంగా జగ్గంపేట సీఐ వి. సురేష్ కుమార్ చేతుల మీదుగా జగ్గంపేట సీహెచ్​సీ వైద్యాధికారి సత్యనారాయణకు అందజేశారు.

ఇదే విధంగా రేపు జిల్లాలోని కాట్రావులపల్లి, రాజపూడి, గండేపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదేవిధంగా వైద్య పరికరాలు అందించనున్నట్లు వారు తెలియజేశారు. కార్యక్రమంలో 1991 - 92 బ్యాచ్ ప్రతినిధులు ఒమ్మి రఘురామ్, మానేపల్లి వీర్రాజు గుప్తా, యూటీఫ్ సాయిరామ్, మాగపు అజయ్, ముద్దాడ కుమార్, రాఘవ (నేను సైతం) వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సేవా దృక్పథాన్ని అధికారులు అభినందించారు.

ఇవీ చదవండి:

21 రోజుల్లో 341 మంది పిల్లలకు కరోనా

వైభవంగా బాలాత్రిపురసుందరి కల్యాణ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.