నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో ఏకంగా రూ.20 స్టాంప్ బాండ్‌పై హామీలను ప్రచురించి ఇచ్చారు. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మేడిశెట్టి సురేఖ సర్పంచి అభ్యర్థిగా, ఏడు వార్డులకు ఏడుగురు అభ్యర్థులు ఓ వర్గంగా నిలబడి పోటీ చేస్తున్నారు. వీరిలో మూడో వార్డు తరఫున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి అనే వ్యక్తి తమ వర్గాన్ని గెలిపిస్తే అయిదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.
సంవత్సర కాలం పాటు కేబుల్ ప్రసారాలు, రేషన్, మినలర్ వాటర్ , బీపీ షుగర్ పరీక్షలు , ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పన ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వీటిని రూ.20 బాండ్‌పై ముద్రించారు. నోటరీ చేయించి మరీ 14 బాండ్‌లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించారు.
ఇదీ చదవండి: అమలాపురం డివిజన్లో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం