భారత న్యాయవాదుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం - రాజమహేంద్రవరంలో ముప్పాల సుబ్బారావుకి సన్మానం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావును ఘనంగా సన్మానించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు గంటా రామారావు, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కల్యాణ చక్రవర్తి సమక్షంలో న్యాయవాదులు ఆయనను సత్కరించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని... హక్కులపై ఉద్యమిస్తానని ముప్పాల సుబ్బారావు తెలిపారు. పెద్దసంఖ్యలో న్యాయవాదులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.