తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాలుగు కేసులు నమోదు కావటంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ లుగా అధికారులు ప్రకటించారు.
ఈ కారణంగా.. మండలంలోని శ్రీ ఉమా మూలేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ఆర్ కృష్ణ వెల్లడించారు. నిత్యం ఆది దంపతులకు ఏకాంత సేవ, కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు.
ఇదీ చదవండి: