తూర్పు గోదావరి జిల్లాలో మామిడి విస్తారంగా సాగవుతోంది. రాజానగరం, కోరుకొండ, గోకవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంకవరం, తుని ప్రాంతాల్లో.. పెద్దఎత్తున మామిడి తోటలు ఉన్నాయి. రాజమహేంద్రవరం, ప్రత్తిపాడు, తుని మార్కెట్లకు పంటను తరలించి.. స్థానిక విక్రయాలతోపాటు ఎగుమతులు కూడా చేస్తుంటారు. ఈ ఏడాది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. కొవిడ్ రెండో దశ విజృంభణతో రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తీవ్రంగా నష్టపోయారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు లేక, తెచ్చిన సరుకును పారబోసి.. రైతులు ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.
రైతుల నుంచి కొనుగోలు చేసిన పెద్ద, చిన్న వ్యాపారులు, కమీషన్‌దారులు కూడా.. అమ్మకాల్లేక భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితి కనీవినీ ఎరుగలేదని.... వరుసగా రెండో ఏడాది మామిడి క్రయ, విక్రయాలపై కరోనా తీవ్రస్థాయిలో దెబ్బకొట్టిందని ఆవేదన చెందుతున్నారు. కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో కొనుగోళ్లు కొరవడి రాజమహేంద్రవరం మార్కెట్ ప్రాంతంలో పారబోస్తున్న మామిడి పండ్లు.. పశువుల పాలవుతున్నాయి.
ఇదీ చదవండి: