తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో ఏడు కుటుంబాలపై సంఘం పెద్దలు సామాజిక బహిష్కరణ విధించటం వివాదానికి దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్, మానవహక్కుల వేదికను బాధితులు ఆశ్రయించారు. గెడ్డం జాన్ సుధాకర్ కుటుంబంతోపాటు స్థానికంగా ఉన్న మరో ఆరు కుటుంబాలను.. రాయల్ యూత్ అసోసియేషన్ నుంచి పెద్దలు వెలివేసినట్లు బాధితులు ఆరోపించారు. గెడ్డం జాన్ సుధాకర్ కుమారుడు జోసఫ్ సంఘం పెద్దల అనుమతి లేకుండా నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నప్పటి నుంచీ వివక్ష కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇటీవల తమ కుమార్తె వివాహానికి ఆహ్వానించినా ఎవరూ వెళ్లొద్దని సంఘం పెద్దలు బెదిరించినట్లుగా తెలిపారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఆరు కుటంబాలపై జరిమానా విధించారని... చెల్లించేందుకు వారు నిరాకరించటంతో వారినీ బహిష్కరించాలని చెప్పారు. దీనిపై విచారణ జరిపి తగు న్యాయంచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై ప్రత్యేక దృష్టి'