తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య స్వామి ఫాల్గుణ ఉత్తర పూర్ణిమ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ నెల 9 న నుంచి శుక్రవారం వరకు ఉత్సవాలు ఘనంగా జరిగాయి.స్థానికంగా ఈ వేడుకలను శూలాాల పండుగగా పిలుస్తారు.
పుష్కర్ ఘాట్లో కలశస్థాపన చేసి మాల ధరించిన స్వాములకు శూలధారణ నిర్వహించారు. సాయంత్రం ఘాట్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం ప్రారంభించారు. రథోత్సవం ముందు వీపునకు శూలాలు గుచ్చుకున్న భక్తులు, శూలాలు ధరించిన వారు, పాల బిందెలతో మహిళలు చేపట్టిన ప్రదర్శన, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు మీదుగా స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు.
ఇదీ చదవండి : ఒకే చోట వందల అందాల కనువిందు... ఎక్కడంటే..?